12 Arrested in LG Polymers Gas Leakage incident CP Press Meet Visakhapatnam,Vizag Vision
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సీఎం జగన్కు నివేదికను అందజేసింది. ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.
అరెస్టైన వారి వివరాలు:
సుంకీ జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
డీఎస్ కిమ్, టెక్నికల్ డైకెర్టర్
పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
ముద్దు రాజేష్, ఆపరేటర్
పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
కె. చక్రపాణి, ఇంజినీర్
కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్

















