One Crore 1,200 kg Cannabis Carrying lorries Seized by Krishna Devi Peta Police Visakhapatnam Vizagvision
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని మంగళవారం కృష్ణదేవి పేట పోలీసులు పట్టుకున్నారు.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవరు మరియు పాంగిదాసు, పాంగి అర్జున్ అదుపులోకి తీసుకోవడం జరిగింది.
కృష్ణదేవిపేట ఎస్ఐ సి.హెచ్.భీమరాజు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బయట రాష్ట్రాల్లో కోటి(One Crore) రూపాయలకు పైగా ఉంటుందని,గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి లారీ స్వాధీనం తీసుకున్నామన్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు దారికాసి కేడీపేట సమీపంలో పట్టుకున్నామని తెలిపారు.

















