సత్య సాయి సేవ సమితి ఉక్కు నగరం ఆధ్వర్యంలో విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు..నగరంలో ఎంవిపి కాలనీ లో గల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమీటు కన్వీనర్ లు రామకృష్ణ చేతులమీదుగా కేమరమేన్స్ కి అందజేశారు..ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు..భారత దేశంలో కోవిడ్ ని ఎదుర్కొనేందుకు అధికారులు,వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సేవలు ఎనలేనివాని కొనియాడారు..
శివుని తరువాత మూడో నేత్రం వీడియో కేమరమేన్స్ కి మాత్రమే ఉంది అని కొనియాడారు…
జర్నలిస్ట్ లు కూడా తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు కృషి చేస్తూన్నారని అన్నారు…కేమరమేన్స్ కోవిడ్ నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు మంచి విజువల్స్ తీసేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు అని తెలిపారు….
ఇప్పటి వరకు వలస కార్మికులకు లాక్ డౌన్ సమయంలో నిత్యం ఉదయం సాయంత్రం ఆహరం అందజేయడం జరిగింది అని తెలియజేసారు…
కార్యక్రమంలో కన్వీనర్ విష్ణు మూర్తి,మస్తానయ్య అసోసియేషన్ ప్రతినిధులు దుర్గ ప్రసాద్, సత్య ప్రసాద్, చంద్ర శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు


















