Child Falls Into BoreWell బోరు బావిలో పడ్డ చిన్నారి in Medak,Vizagvision…మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో కొత్తగా వేసిన బోరు బావిలో మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. బోరు వేసిన అరగంటలోనే చిన్నారి పడినట్లు సమాచారం. బోరు వేశాక ఎవరి పనుల్లో వారు ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.