12 Hrs పనివిధానం అమలు చేయాలని చూస్తున్న విధానాలకు స్వస్థి పలకాలని హార్బర్ & పోర్ట్ వర్కర్స్ యూనియన్ in Visakhapatnam,Vizagvision….
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనివిదనాన్ని కాదని నేడు 12 గంటల పనివిధానం అమలు చేయాలని చూస్తున్న విధానాలకు స్వస్థి పలకాలని విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం, కార్మిక హక్కులపై దాడి, ప్రజాఉద్యమల్ని నిర్బంధం వంటి వాటిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్నీ కార్మిక సంఘాలు ఇచిన్న పిలుపుమేరకు శుక్రవారం ఉదయం యూనియన్ కార్యాలయంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జె వి సత్యనారాయణ మూర్తి ముఖ్యఅతిధిగా పాల్గోని మాట్లాడుతూ నేడు కార్మిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ యాజమాన్యాలతో కుమ్మకై కార్మిక హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో కుడైలైన ఆర్థిక రంగానికి ఉతమిస్తూ ప్రకటించిన 20 లక్షల కోట్లా రూపాయాలు నేడు అసలైన కార్మిక వర్గానికి చేరడం లేదని అన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా వందలాది మంది మృతికి కరకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి bch మసేన్ మాట్లాడుతూ వలసకార్మికుల తరలింపుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం బరించాలని, లాక్ డౌన్ వేళా కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ఫ్రీవేటికరణను నిలుపుదల చేయాలని, కేరళ తరహా 17 నిత్యావసర వస్తువుల సరుకులు ప్రజలందరికీ 3 నెలలు పాటు అందజేయాలని డిమాండ్ చేశారు.