VIZAGVISION:Kidnap Mystery Traced 4 Arrested,Visakhapatnam..విశాఖ గోపాలపట్నం రెండురోజులక్రితం అపహరణకు గురైన మణికంఠ 20 కేసులో కీలక మలుపు. అపహరణకు గురైన మానికంటే కేసులో ఏ1 ముద్దాయి అవడం కొసమెరుపు. గోపాలపట్నం లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో నివాసముంటున్న మణికంఠ వ్యసనాలకు బానిసై ఊరినిండా అప్పులు చేయడంతో తన తల్లిదండ్రుల వద్దనుండే డబ్బులు గుంజుదామని తన స్నేహితులు వెంకటేష్ , అరుణ్ తేజ మణికుమార్ కలసి కిడ్నాపింగ్ డ్రామా ఆడి మణికంఠ ఫోన్ తో తన అక్క అయిన శ్రావణికి ఫోన్ చేసి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతె చంపేస్తామని బెదిరించారు. దీనితో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి మణికంఠ ఆడిన నాటకాన్ని ఛేదించి గాజువాకలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మణికంఠను విచారించగా అసలువిషయం బయటపడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చెడువ్యసనాలకు బానిసై కన్నతల్లిదండ్రుల వద్దే డబ్బుగుంజడానికి వేసిన పన్నాగం సభ్యసమాజం తలదించుకునే విధంగా చేసారు. గోపాలపట్నం పోలీసులు మీడియా సమావేశం ఏర్పటుచేసి నిందితులను ప్రవేశపెట్టారు. మణికంఠ స్నేహితులలో ఒకరైన వెంకటేష్ ఇతనికి రౌడీషీట్ మరియు 20 నేరాల్లో పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి.