Accident on Highway 2Death Anandapuram,Visakhapatnam,Vizagvision…ఆనందపురం జాతీయ రహదారి వెల్లంకి వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు.విశాఖ నగర శివార్లలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో వెనక కూర్చున్న వ్యక్తి మారికవలసలో నివాసముండే అప్పలరాజు గా గుర్తించారు. ఇతను వెల్లంకిలోని శివం స్కూల్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఉదయం స్కూల్ నుంచి బస్సును తీసుకుని పిల్లలను స్కూల్ కు తెచ్చేందుకు బయలు దేరాడు. మారికవసల జాతీయ రహదారిపై వెల్లంకి వైపు టూ వీలర్ పై వెళుతున్న రాజపులోవ పంచాయితీ సెక్రటరి శ్రీనివాస్ ను లిఫ్ట్ అడిగి అప్పలరాజు అతని తో పాటు వెళుతున్నాడు. ఈలోపునే గుర్తు తెలియని వాహనం డీకోనడంతో ఇరువురు మృత్యువాత పడ్డారు.