“prediscoverindia” Magazine Releas in Visakhapatnam,Vizagvision…”ప్రి డిస్కవర్ ఇండియా” మ్యాగ్జిన్ ను శుక్రవారం సాయంత్రం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారు.
విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, వినియోగదారుల హక్కుల సంస్థ డాక్టర్ వికాస్ పాండే లు ముఖ్య అతిధులుగా హాజరయి ఈ మ్యాగ్జిన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ
ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవలను ఈ మ్యాగ్జిన్ లో పొందుపరిచారని చెప్పారు. ప్రముఖ దర్శనీయ స్థలాలు, ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ టిప్స్,
హాస్పిటల్, ఇతర మెడికల్ వివరాలను,అలాగే వివాహాది శుభకార్యక్రమాలకు అవసరమైన వివరాలు,
గృహోపకరణాలు సంబంధించిన పూర్తి వివరాలను ఈ మ్యాగ్జిన్ లో పొందు పరిచారని పేర్కొన్నారు.ఈ మ్యాగ్జిన్ లో వివరాలు చాలామంది కి ఉపయోగపడతాయని వెల్లడించారు. వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూ ఈ మ్యాగ్జిన్ నాలుగు విభాగాలుగా ప్రింట్ చేసి విడుదల చేశారని చెప్పారు.ఈ మ్యాగ్జిన్ లో చాలా సమాచారం ఉందన్నారు.ఈ మ్యాగ్జిన్ మార్కెట్ లోకి వెళ్తే మంచి స్పందన వస్తుందన్నారు.
పిడీఐ సీఈఓ అమిత్ మాట్లాడుతూ గోవాలో ప్రారంభించిన ఈ సంస్థ నేడు
ఒక మ్యాగ్జిన్ కూడా రిలీజ్ చేసి చాలా వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ మ్యాగ్జిన్ అందరికి నచ్చి తీరుతుందని అన్నారు.
త్వరలో తమ సంస్థ పిడీఐ వెబ్ ఛానెల్ ను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ప్రి డిస్కవర్ ఇండియా, కన్స్యూమర్ రైట్ ఆర్గనైజేషన్, సనరా ఫీనిక్స్ మూవీస్, రాస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో వినియోగదారుల ఆధ్వర్యంలో హక్కులు-భాద్యతలు అనే అంశం పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల పోస్టర్ ను విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ రఘు రామ్, ప్రి డిస్కవర్ ఇండియా ఎండి మహేష్ జొన్నాడ, రాస్ టెక్నాలజీస్ ఎండి శరత్ చంద్ర, కీర్తన పేపర్ ప్లేట్స్ మానుఫ్యాక్చరింగ్ అధినేత వేణు గోపాల్,మధుర ఇన్ హోటల్ ఎండి శ్రీధర్,
ప్రి డిస్కవర్ ఇండియా మీడియా అడ్వైజర్ సనరా వంశీ, సిబ్బంది హారిక, నిహారిక,రాధిక, కోమల్,ప్రియాంక, సురేష్, శశి, ఉదయ్ కిరణ్, శ్రీను,
రామ్,యస్వంత్, శిరీషా, భాను తదితరులు పాల్గొన్నారు.

















