12న అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నామ అయ్యప్ప సేవా ట్రస్ట్ పెందుర్తి in Visakhapatnam,Vizagvision…పెందుర్తి ప్రాంతంలో ఉత్తరాంధ్ర శబరిమల పేరు తో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించామని పెందుర్తి అయ్యప్ప సేవా ట్రస్ట్ ప్రతినిధి పీలా గోవింద సత్యనారాయణ తెలియజేశారు.
పెందుర్తి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12న అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నామన్నారు.
ఈ విగ్రహ ప్రతిష్ట శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంబూద్రి కృష్ణదాస్ విచ్ చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి నియమ నిష్టలతో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారో అదే రీతిలో పెందుర్తి ఆలయం లో కూడా అటువంటి నిబంధనల పాటిస్తున్నామని,అంతే కాక మహిళలు స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నారు.
అలాగే భక్తులు 18మెట్లు,అభిషేకాలు చేయడానికి మహిళలకు అనుమతి లేదని అన్నారు.
చాలామంది అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల ప్రాంతానికి వెళ్లి దర్శనం చేసుకోవటం కొరకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని పెందుర్తి ప్రాంతంలో సుమారు 6 కోట్ల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆలయం అభివృద్ధి చెంది ప్రతియేటా 41 రోజులుపాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులందరికీ ఉచిత భోజన,వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు……

















