JCI Visakha Valley Set up “Honesty Shop” at GVMC Dandu Bazar School – Integrity Day in Visakhapatnam,Vizagvision…జెసిఐ ఇండియా దేశవ్యాప్తంగా ఇంటిగ్రిటీ డే ని నిర్వహించింది. ఇంటిగ్రిటీ డేను పురస్కరించుకుని జెసిఐ విశాఖ వ్యాలీ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థినీ విద్యార్థులలో నైతిక విలువలు. నిజాయితీని పెంపొందించేందుకు ‘హానెస్టీ షాపి’ ప్రారంభించింది. దండు బజార్ స్కూల్లో ఈ హానెస్టీ షాప్ ను ఏర్పాటు చేశారు.
జోన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఉదయ్ ఈ హానెస్టీ షాపును ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ హానెస్టీ షాప్ లో విక్రయాలు జరిపేందుకు ప్రత్యేకంగా ఎవరూ ఉండకపోవడం విశేషం. విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, తినుబండారాలను ఇందులో ఉంచారు. పిల్లలు వారికి అవసరమైన స్టేషనరీ వస్తువులు లేదా తినుబండారాలను తీసుకొని దానికి సరిపడా డబ్బును అక్కడే ఉంచిన హానెస్టీ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ వినూత్న హానెస్టీ షాపి అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో జెసిఐ విశాఖ వ్యాలీ అధ్యక్షులు సింధు, ఉపాధ్యక్షులు రామ సూర్య, ప్రతినిధులు సంతోష్, లక్ష్మీనారాయణ, ఉష, ప్రవీణ్, అదనన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

















