Appanna Swamy Jewelry Exhibition Museum inaguration in Simhachalam,Visakhapatnam,Vizagvision…విశాఖ సింహాచలం . శ్రీవరాహలక్ష్మినృసింహస్వామివారి ప్రాచీన కాలం నాటినుండి అలంకరించిన ఉత్సవాల సమయంలో ఉపయోగించిన బంగారు ఆభరణాల ను భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను బుధవారం అనువంశికధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు , రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లు ప్రారంభించారు .1978 వ సంవత్సరం లో స్వామివారిఆలయంలో చోరీ జరగగా , విలువైన ఆభరణాలు కొన్ని తిరిగి దొరకగా , మరికొన్ని అదృశ్యం అయ్యాయి .వున్న ఆభరణాలు స్వామివారి ప్రాచీన విశిష్టత తెలుసేవిధంగా 2010 వ సంవత్సరం లో ఆలయ భేదా మండపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు . మరల ఇప్పడు శాశ్వతంగా భక్తులు తిలకించేందుకు ప్రదర్శనకు ఉంచారు .

















