MP Vijayasaray Reddy మీద వచ్చిన బ్యానర్ వార్త అతి నీచ బుద్ధికి నిదర్శనం YSRCP Konda Rajavi in Visaskhapatnam,Vizagvision…వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిథి కొండా రాజీవ్ గాంధీ మీడియా మీట్:
ఆంధ్రజ్యోతిలో మా ఎంపీ విజయసాయిరెడ్డి మీద వచ్చిన బ్యానర్ వార్త అతి నీచ బుద్ధికి నిదర్శనం.
మా పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ అధినేత జగన్ సన్నిహితుడు. రాజ్యసభ సభ్యుడుగా ఆయన విశాఖ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఇక్కడ తన నిధులన్నీ కేటాయిస్తున్నారు. అలాటపుడు ఆయన అధికారులతో సమీక్ష జరపకూడదా?
లోకేష్ గురించి, బాలకృష్ణ గురించి ఏనాడైనా ఇలా రాశావా? మంగళగిరి అని పలకటం రాని వ్యక్తిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, మంత్రి చేసి షాడో సిఎం గా మారిస్తే నీ పత్రిక ఏమైంది? హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నువు నోరెత్తి తప్పుపట్టలేదేం?
కేవలం విశాఖను పాలనా రాజధాని చేయటం ఇష్టం లేక ఇలా విషం చిమ్ముతున్నావు. నీ రాతలు నమ్మటం ఎప్పుడో మానేశారు. నీ రాతలకు రోతపుట్టి తెలుగుదేశానికి 23 స్థానాలకు నెట్టేశారు.
విశాఖలో గెలిచిన నలుగురు దేశం ఎమ్మెల్యేల భచిష్యత్తు కూడా భూస్తాపితం చేస్తారు.
చంద్రబాబుని హీరోని చేయాలని రాధాకృష్ణకి ఉంటే 23 మంది దేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించు. నీ పాపాల చిట్టా త్వరలోనే బయటకు వస్తాయి. ఇకనైనా దిక్కుమాలిన రాతలు మానేయ్


















