GO No.72 Should be Canceled Demand CPI in Visakhapatnam,Vizagvision…
విశాఖలో జగన్ సర్కారు ఆరువేల నూటపదహారు ఎకరాల భూ సమీకరణకు పూలింగ్ పేరిట తెరతీయటం పెద్ద కుంభకోణం. గతంలో ముదపాక భూముల పూలింగ్, ఓజోన్ వ్యాలీ పూలింగ్ మోసాలు జరిగాయి. ఇపుడు వైకాపా సర్కారే మళ్లీ పూలింగ్ ఎందుకు చేయాలి? పేదల భూములు తీసుకోవటం దారుణం. పేదల జీవనోపాధికి ఇచ్చిన ఎసైన్డ్ భూములు సేకరించరాదు. ఒక పేదకు మేలంటూ మరో పేద కడుపుకొట్టరాదు.
జిఓ నెంబరు 72 రద్దు చేయాలి. ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే, అప్పటి వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ భూకుంభకోణాల మీద ధర్నాలు చేశారు. సిట్ వేశారు. ఇపుడు మళ్లీ సిట్ నడుస్తోంది. ఆ భూసేకరణ విధానమే కొనసాగించకుండా పరిశ్రమలకు కేటాయించి ఖాలీగా ఉన్న వేల ఎకరాల భూములు వెనక్కితీసుకోవాలి.


















