TWO Children Death in Natavaram Mandalam.Visakhapatnam,Vizagvision….రాజకీయ పార్టీల విబేదాలు ఇద్దరు చిన్నారుల మృతికి కారణమయ్యంది .ముక్కు పచ్చలారని చిన్నారుల మరణం తల్లిదండ్రులకు పుత్రశోకంతో పాటు ఆగ్రామంలో విషాదం నింపింది..విశాఖ జిల్లా నాతవరం మండలం నాయుడు పాలెం గ్రామానికి చెందిన పైల తరణ్ రమేష్ (12),పోలిపల్లి సతీష్ (10)లు పాయకరావుపేట శ్రీ ప్రకాష్ స్కూలేలో ఐదవతరగతి చదువుతున్నారు.తరణ్ రమేష్ ఇంట్లో ఆదివారం ఓ శుభాకార్యానికి సంబందించిన వేడుక ఉండటంతో రమేష్ తోలాటు బందువయిన సతీష్ ను కూడా తీసుకుని వచ్చారు.ఇద్దరుస్నేహితులు ఈ రోజు తెల్లవారుజామున సమీప గ్రామమయిన శరభవరంలో టిఫిన్ చేయటానికి సైకిల్ పై వెళ్లారు.తిరిగి నాయుడు పాలెం వస్తుండగా రోడ్డుపై బురదలో సైకిల్ జారిపోవడంతో పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడిపోయారు.ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలో ఉదృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయినప్పటికి చిన్నారుల ప్రాణాలను కాపాడలేకపోయారు. రాజకీయ పార్టీల పట్టింపులు వలనే ఈ రహదారి నిర్మాణం పూర్తికాలేదని కారణంగా చిన్నారుల ప్రాణాలను కోల్పోయారని గ్రామస్తులు కన్నీటిపర్యంత మయ్యారుమయ్యారు.నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరవకుని పరిస్థిని సమిక్షించారు.