Kalki Bhagavan Ashram 44Crs Cash,20crs US Dollers,90Kgs Gold Seizerd IT Department in Channai,Vizagvision…
కల్కిభగవాన్ దంపతులకు చెందిన ఆశ్రమాలు,వ్యాపార సంస్థలపై ఇవాళ కూడా దాడులు జరిగాయి.
చెన్నైలోని కల్కీ భగవన్కు చెందిన వైట్ లోటస్ ప్రాపర్టీలపై సోదాలు జరిగాయి.
అక్కడ ఐటీ శాఖ అధికారులు ఇవాళ భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 44 కోట్ల నగదును సీజ్ చేశారు.
అక్కడే సుమారు 20 కోట్ల విలువైన అమెరికా డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో మరో 90 కేజీల బంగారాన్ని కూడా పట్టుకున్నారు.
చెన్నైతో పాటు హైదరాబాద్, బెంగుళూరు, చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో ఐటీశాఖ అధికారులు సోదాలు చేశారు.