తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది.
కోయంబత్తూరు, శివదండై, నీలగిరి, నామక్కల్ జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కోయంబత్తూరు జిల్లాలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాలతో కోయంబత్తూర్, తిరువళ్లూరు జలమయం అయ్యాయి.
అదేవిధంగా చెన్నై, తిరునలివేలి, ఊటీతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.