ప్రత్యేకమైన శైలిలో భారతీయ సంసృతిని వివరిస్తూ తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన టూరిస్ట్ గైడ్ నాగేంద్ర ప్రభూ విదేశీ పర్యటకులను ఆకట్టుకుంటున్నాడు.
సాంప్రదాయ నృత్యంలోని బంగిమలను, ముఖ కవళికలను చూపిస్తూ భారతీయ సంసృతి గొప్పదనాన్ని విదేశీయులకు వివరిస్తున్నాడు.
మధురై పట్టణ గొప్పదనాన్ని ఆకట్టుకునే రీతిలో తెలియజెప్పడం నాగేంద్ర ప్రభు ప్రత్యేకత.
టూరిస్ట్ గైడ్ వృత్తిలోకి రాకముందు తాను స్కూల్లో టీచర్‌గా పనిచేసేవాడనని ఆయన తెలిపాడు.
విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో నటించి పాఠం సారాంశం వివరించే వాడినని అదే పద్ధతిని టూరిస్ట్ గైడ్‌గా కొనసాగిస్తున్నాని వెల్లడించారు