Port Venkateswara Swamy Teppotsavam in Visakhapatnam,Vizagvision…విశాఖ పోర్టు ఏరియా శృంగ మణి పర్వతంపై వేంచేసిన శ్రీనివాసునీ తెప్పోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్త కోటి తరలిరాగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు అత్యంత మనోహరంగా సముద్రంలో నౌకా విహారం చేశారు..
సతీసమేత శ్రీనివాసుడు నౌకావిహారం మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామివారి తెప్పోత్సవం మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు కోసం టగ్స్, బోట్లు ఏర్పాటు చేశారు. గోవిందా గోవింద నామస్మరణల మధ్య మహోత్సవం అత్యంత మనోహరంగా అద్భుతంగా జరిగింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీసమేత శ్రీనివాసుని దర్శించుకొని భక్తితో పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునీ తెప్పోత్సవ మహోత్సవంలో
భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు వసతులు కల్పించారు. ఈవో బండారు ప్రసాదు, ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి కొల్లి రమేష్,, mylapalli శ్రీను ధర్మ కర్తలు పాల్గొన్నారు.