సాధారణంగా చిన్న సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతుండడం చూస్తుంటాం. కానీ, ఈ మధ్య స్టార్‌హీరోల సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. అదీ నెలల పాటు వాయిదా పడుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య సినిమా ‘సింగం-3’ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలో విడుదల కావాల్సింది. చివరికి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
మరో స్టార్ హీరో వెంకటేష్ సినిమా ‘గురు’ కూడా వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. మాధవన్ హీరోగా నటించిన ‘సాలా ఖాడూస్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామనకున్నారు. అయితే సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీపడడంతో జనవరి 26న వద్దామనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదలను ఏకంగా మూడు నెలలు వాయిదా వేసేశారు. సమ్మర్ సీజన్ అయిన ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.