హీరోయిన్గా భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌కు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది కాజల్. ‘పక్కా లోకల్’ అంటూ సాగే ఆ సాంగ్ కాజల్‌కు డబ్బులతోపాటు, పబ్లిసిటీని కూడా తీసుకొచ్చింది. ఆ పాట తర్వాత కాజల్ హీరోయిన్గా బాగా బిజీ అయిపోయింది.
అయినప్పటికీ భవిష్యత్తులో ఐటెమ్సాంగ్స్లో నర్తిస్తానని చెప్పేసింది. అయితే ఆ పాటలు తనకు కిక్ ఇచ్చే విధంగా ఉండాలని షరతులు పెడుతోంది. తనకు నచ్చితే పెద్ద హీరోల సినిమాల్లోనే కాకుండా, చిన్న సినిమాల్లో కూడా ఐటెమ్‌గాళ్‌గా ఆడిపాడతానని బంపరాఫర్ ఇచ్చింది. హీరోయిన్గా కెరీర్ చివరి దశకు వచ్చిన తరుణంలో ఐటెమ్‌గాళ్‌గా మార్గం సుగమం చేసుకుంటోందన్నమాట కాజల్.