విశాఖలో అన్యాక్రాంతమైన భూములను పరిశీస్తున్న సమయంలో గాయపడ్డ సీపీఐ నారాయణ.కొమ్మాది సర్వేనంబర్ 34లోని 22 ఎకరాల భూమిని పరిశీలించిన నారాయణఆక్రమణలో ఉన్న భూమి ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేసిన నారాయణ,సీపీఐ నాయకులు ఫెన్సింగ్ రాయి మీద పడటంతో నారాయణ కాలుకి గాయం,సీపీఐ నేత నారాయణ కాలికి గాయమైంది. విశాఖలోని మధురవాడలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు నారాయణ కార్యకర్తలతో కలిసి వెళ్లారు. అక్కడ అక్రమంగా నిర్మిస్తున్న గోడను కాలితో తన్ని.. కూలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.