Weather Update: Cyclone “Fani” Centered Around 430 km Away in Visakhapatnam,Vizag Vision…ఫొని పెను తుఫాన్‌గా మారింది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతోంది. పూరికి దక్షిణ దిశగా 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో ఫణి కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు.
ఎల్లుండి మధ్యాహ్నం ఒడిశాలోని.. గోపాల్పూర్, చంద్బలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 175 నుంచి 180 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 205 కి.మీల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.