Cyclone “Fani” Alert Announced by Collector in Visakhapatnam,Vizag Vision…బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని . ఫోని తుఫాన్ ప్రస్తుతం విశాఖ కు 400కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ పూరి వద్ద ఈ నెల 3 న తీరం దాటే అవకాశం ఉందని . తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైందని విశాఖ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. విశాఖ తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో సురక్షిత చర్యలు చేపట్టనున్నామని తహశీల్తార్ కార్యాలయల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విశాఖ తీర ప్రాంతం లో ఉన్న 7 అతి ప్రభావిత మండలాలలో 65 గ్రామాలను గుర్తించి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని . రేపటి నుంచి 65 గ్రామాల్లో పునరావాసం ఏర్పాటు చేస్తామని తెలిపారు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, జివిఎంసి పరిధిలో వాటర్ ట్యాంకులు సిద్ధం గా ఉంచామని విద్యుత్ లేకున్నా జనరేటర్లతో 3 రోజులు పాటు నీటి సమస్య తలెత్తకుండా జీవీఎంసీ చర్యలు చేపట్టిందని .కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుంటే ఎటువంటి విపత్కర పరిస్థితినైన ఎదుర్కోవచ్చుని తెలిపారు.