జైపూర్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై దాడి జరిగింది. జైపూర్‌లో పద్మావతి చిత్రం షూటింగ్ జరుపుతుండగా రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన్ను చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఘటన జైగఢ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీం మొత్తం షాక్‌కు గురైంది. సినిమాలో రాజ్‌పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపించారు. సినిమాలో రాజ్‌పుత్ రాణిగా దీపికా పదుకొణే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు.