సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ గారితో వామపక్షాల నేతలు చర్చలు,అమరావతి,VIZAGVISION..
సీట్ల సర్దుబాటులో భాగంగా వామపక్షాల నేతలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి చర్చలు జరిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈ చర్చలకు వేదికైంది. తొలుత సీపీఎం, సీపీఐ నేతలు జనసేన సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో చర్చించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చలు మరోసారి కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో సీపీఎం పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మధు, శ్రీ ముప్పాల నాగేశ్వరరావు సీపీఐ పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ఱ, శ్రీ కొల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అక్కినేని వనజ పాల్గొన్నారు.

















