International Beach volleyball on 27th Fed at Beach Road in Visakhapatnam,Vizagvision….స్మార్ట్ సిటీ విశాఖపట్నం మరో మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం సన్నద్ధం అవుతుంది. భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా బీచ్ వాలీబాల్ నిర్వహించేందుకు విశాఖ సన్నద్ధం అవుతుంది. రామకృష్ణ బీచ్ వేదికగా ఐదురోజుల పాటు జరిగే వాలీబాల్ వరల్డ్ ఈవెంట్ ఈనెల 27వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలకు చెందిన 26 మహిళల జట్లు, 30 పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు చెందిన జట్లు నగరానికి చేరుకున్నాయి. వాలీబాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ విప్ గణ బాబు నేతృత్వంలో నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. భారత వాలీబాల్ సంఘం సాంకేతిక సలహాదారు ద్రోణాచార్య రమణ రావు, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ జియో పవన్ ఒలింపియన్ ఎం. వి. మాణిక్యాలు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ప్రసన్న కుమార్ తదితర సభ్యుల గల కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. భారత వాలీబాల్ సంఘం సహాయ సహకారాలతో కోల్ కత్తాకు చెందిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దేశంలోనే తొలిసారిగా బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ఈవెంట్ ను విశాఖ సాగరతీరంలో నిర్వహిస్తోంది. లీజర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ముఖ్య ప్రతినిధి దాస్ గుప్తా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ 27వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతుంది. 28వ తేదీ ఉదయం 7 గంటల నుండి మ్యాచులు మొదలవుతాయి ఈ టోర్నమెంట్ ప్రత్యక్షంగా తిలకించేందుకు టిక్కెట్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. సి. ఎం. ఆర్. సెంట్రల్, ఆర్కే బీచ్, పోటీలు జరిగే వేదిక వద్ద టిక్కెట్లు లభ్యమవుతాయి అయిదు వేల మంది తిలకించే విధంగా గ్యాలరీలు నిర్మించారు. విద్యుత్ కాంతుల నడుమ కూడా పోటీలు నిర్వహిస్తారు. ఫస్ట్ బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ఈవెంట్ విషయాలను వాలీబాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణబాబు సోమవారం సాయంత్రం పాత్రికేయులకు వివరించారు.