“MODI DONT STEP IN ANDHRA” by TDP in Visakhapatnam.Vizagvision…కేంద్ర ప్రభుత్వం సమైఖ్య స్పూర్తిని కాపాడాలని టిడిపి యువనేత శ్రీభరత్ హితవుపలికారు.. గడిచిన 15 ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాలను కేంద్రప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు కడుతున్న పన్నుల్లో సహేతుకంగా రాష్ట్రాలకు రావల్సిన నిదులు రావడం లేదన్నారు. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి రావల్సిన అన్నింటిని కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిందేనన్న శ్రీభరత్, విశాఖ జి.వి.యం.సి గాంధి విగ్రహాం వద్ద ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎర్పాటు చేసిన మోది గో బ్యాక్ నిరశన కార్యక్రమంలో పాల్గోన్నారు. తలపై బుట్టలు పెట్టుకుని కేంద్రప్రభుత్వ వైఖరిపై నిరశన వ్యక్తం చేసారు.. ఈసందర్బంగా పాక్ ఉగ్రవాద శిభిరాలపై వైమానిక దాడులు చేసిన భారత సైన్యాన్ని అభినందించారు. దేశ రక్షణ కోసం వైమాని దళం సత్తా చాటిన తీరుకు భారతీయులందరు గర్వపడాల్సిన విషయమని తెలిపారు,. నిరశన కార్యక్రమంలో ఎమ్మేల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ.. మోది నిరంకుశంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇవ్వకుండా ప్రత్యేక హోదా హామిని అమలు చేయకుండా విశాఖలో మోది పర్యటించడం తిరిగి ప్రజలను మోసం చేయడానికే అని విమర్శించారు.. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయకుండా రాష్ట్రంలో విద్యాసంస్ధలకు అరకోరా నిధులు ఇచ్చారన్నారు.. ఇలా నిదులు మంజురు చేస్తే 30 ఏళ్లకు కూడా అవి పూర్తి అయ్యే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. మోది. జగన్. కెసిఆర్ లు రాష్ట్రంలో అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు…