భీమిలి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గంటా. ఉత్సవాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్, పడవలు, తెరచాప పడవల పోటీలు, కార్నివాల్, కబడ్డీ పోటీలు, వ్యాసరచన, వాలీబాల్, ముగ్గులు పోటీలు, వంటలు పోటీలు, మరియు ఇతర పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, గణబాబు గారు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ విజయ్ బాబు గారు, లాలం భాస్కరరావు గారు, డిఎల్ డీఏ చైర్మన్ గాడు వెంకటప్పడు గారు, ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణం గారు, భీమిలి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు, టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, టూరిజం శాఖ , తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు మరియు స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.