ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ సైకత శిల్పం రూపకల్పన..
సెల్ఫీలు దిగుతూ విస్త్రత ప్రచారం చేస్తున్న పాదచారులు, వాహనచోదకులు
సెల్ఐటి న్యూస్, విజయవాడ: ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని విజయవాడలో రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేస్తుంది. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనైశ్చర స్వామి దేవస్థానం సమీపంలో 9 క్యూబిక్ టన్నుల ఇసుకతో 25 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తులో విజయవాడకు చెందిన అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ క్రమంలో రోడ్డు వెంబడి వెళ్లే పాదచారులు, వాహనచోదకులు ఆగి మరీ సైకత శిల్పం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ విస్త్రత ప్రచారం కల్పిస్తున్నారు. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని తద్వారా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.