హిమాలయ బేబీకేర్ నుంచి కొత్త డివిసి (డైలీ వీడియో క్యాంపెయిన్) ప్రారంభం
-బలవర్థకమైన ఎముకల పుష్టిని హైలైట్ చేస్తున్న వీడియో
-సంప్రదాయకమైన మర్థనలో అశ్వగంధ, బాల పోషించే పాత్రలను గురించిన వివరణ లో అత్యంత విశ్వసనీయమైన బేబీ కేర్ బ్రాండ్లలో ఒకటైన, శిశువులకు ఎంతో ఇష్టమైన హిమాలయా బేబీ కేర్, హిమాలయా బేబీ మసాజ్ ఆయిల్ కోసం ఒక కొత్త డీవీసీని ఆవిష్కరించింది. ఇది బాల్యదశపై నూతన దృక్పథాన్ని ఆవిష్కరిస్తూ, శిశువుగా ఉండటం కనిపించే దానికంటే మరింత సవాళ్లతో కూడుకున్నదని తల్లిదండ్రులకు గుర్తు చేస్తుంది.
శిశువుల కోణం నుంచి ఆలోచింపచేసేలా ఉంటుందీ వీడియో. శిశువే తాను ఎదగడానికి కావలిసిన క్రుషిని పట్టి చూపుతుంది. పెద్దల ఆలోచనా విధానంలో శిశువులు రోజంతా ఎంత విశ్రాంతిగా ఉంటారో నవ్వుతూ చెబుతుంటారు. నిజానికి వారి బిజీ దినచర్యను—అంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, బరువు పెరగడం, ఇంకా వారి మొదటి పళ్ళు రావడం వంటివాటిని—హాస్యభరితంగా హైలైట్ చేశారు. ఈ సరదా కథనం ద్వారా, పసిపిల్లలకు పెరగడం అనేది ఒక పూర్తికాలపు ఉద్యోగం అనే భావనను ఈ చిత్రం తెలియజేస్తుంది.
అశ్వగంధ, బాల వంటి సహజ పదార్ధాలతో సమ్మిళితమైన ఈ బేబీ మసాజ్ ఆయిల్ ఈ ప్రచారంలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఈ రెండు పదార్థాలు సహజంగానే శిశువులకు మరింత బలాన్ని చేకూర్చుతూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. రోజువారీ దినచర్యలో భాగంగా శిశువులకు మర్ధన అత్యంత ముఖ్యమైనది అని తెలియజెప్పేలా ఉంటుందీ వీడియో. ఇది శిశువుల ఎదుగుదలకు ప్రారంభం నుంచే కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలియజెప్పేలా కూడా ఉంటుంది.
ఈ ప్రచార వీడియో గురించి హిమాలయా వెల్నెస్ కంపెనీ, బేబీకేర్ డైరెక్టర్ అయిన శ్రీ ఎన్. వి. చక్రవర్తి మాట్లాడుతూ, "హిమాలయా బేబీకేర్లో, శిశువు ఎదుగుదల అనేది వారు ప్రతిరోజూ పొందే శ్రద్ధ, అనుబంధ క్షణాల ద్వారా రూపుదిద్దుకుంటుందని మేము నమ్ముతాము. బేబీ మసాజ్ అనేది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఒక సంప్రదాయం. ఇది శిశువును శారీరకంగా బలపరుస్తుంది, తల్లిదండ్రులు-పిల్లల అనుబంధాన్ని బలపరుస్తుంది, వారి మధ్య భావోద్వేగానుబంధం బలపడుతుంది. అలాగే శిశువుల సంపూర్ణ శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఈ డీవీసీ ద్వారా, మేము తల్లిదండ్రుల స్పర్శ యొక్క శక్తిని చాటి చెప్పాలనుకున్నాము. అలాగే, రోజూ మసాజ్ చేయడం వంటి సాధారణ, స్థిరమైన పద్ధతులు శిశువు యొక్క బలానికి, సర్వతోముఖాభివృద్ధికి ఎంతటి అర్థవంతమైన పాత్ర పోషిస్తాయో పునరుద్ఘాటించాలనుకున్నాము. కాలపరీక్షకు నిలిచిన సహజ పదార్ధాల మేలుతో సుసంపన్నమైన హిమాలయా బేబీ మసాజ్ ఆయిల్‌తో, తమ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధి కోసం తల్లిదండ్రులు విశ్వసించగల సున్నితమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతను మేము కొనసాగిస్తున్నాము" అని పేర్కొన్నారు.
భారతదేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులతో అనుసంధానం కావడానికి, ఈ డీవీసీని డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రారంభించారు. అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి, ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ భాషల్లోకి కూడా అనువదించారు. సులభంగా అర్థమయ్యే కథనం ద్వారా, ఈ ప్రచారం, రోజువారీ మసాజ్ అనే శాశ్వత సంప్రదాయం కోసం, కాలపరీక్షకు నిలిచిన మూలికలతో సమృద్ధమైన నూనె చేసే మేలు జీవితానికి మరింత బలమైన, ఆరోగ్యకరమైన ఆరంభాన్ని అందించాలనే హిమాలయా బేబీకేర్ వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తుంది.
















