శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు. వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన,రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామన్నారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. భక్తి భావంతో వస్తురూపణ గాని బియ్యం పప్పుదినుసులు, కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి, రసీదు పొందవలసిందిగా కోరారు. మీడియా సమావేశంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కే. కోటేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, గురుస్వామి కడగల శ్రీను, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కే సుబ్రహ్మణ్యం, కే శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి, పి.అవతార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

















