Latest News
- Visakhapatnam Vizagvision:
- గణేష్ నిమజ్జనం విశాఖ బీచ్ లో#vizagvision #ytshots
- Operation Sindoor నమూనాలో గణనాథుడు #vizagvision #ytshots
- Vizag vision:విశాఖ బీచ్ లో మొదట రోజు గణేష్ నిమజ్జనం
- Vizag vision:
- Operation Sindoor నమూనాలో గణనాథుడు #vizagvision #ytshots #ganesh chaturthi 2025
- Vizagvision: Operation Sindoor నమూనాలో గణనాథుడు Yuva Sena Foundation in Visakhapatnam
- Visakhapatnam Vizagvision:
- Visakhapatnam Vizagvision:
- Visakhapatnam Vizagvision: విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వార్షిక సంగీత, నృత్య, నాటక ఉత్సవాలలో నాలుగో రోజున ప్రఖ్యాత కర్ణాటక గాత్ర వద్వాంసులు బెంగళూరు నివాసులు” బెంగళూరు బ్రదర్స్” గా పేరుగాంచిన హరిహరన్ అశోక్ సోదరుల గాత్రయిగళం చాలా రసవత్తరంగా సాగింది. కార్యక్రమానికి ముందుగా నేటి ముఖ్య అతిథులు శ్రీ అభిలాష్ & శ్రీమతి దివ్యభిలాష్, కళాభారతి అధ్యక్షులు శ్రీ M. S. N. రాజు , కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, Dr. పంతుల రమ, ప్రకాష్ పిల్ల రమణమూర్తి జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. నేటి కర్ణాటక గాత్రయుగళ కచేరిలో కళాకారులు ముందుగా వర్ణం – దయానిదే – బేగడ రాగం – అది తాళం – శ్యామ శాస్త్రి రచన తో ప్రాంభించేరు.జయ జయ స్వామి – నాట రాగం – అది తాళం లో – నారాయణ తీర్థ కీర్తనను బహు శ్రావ్యంగా గానం చేసి అందరి హర్ష ద్వానాలు అందుకొన్నారు.గురు కృప లేక – పుష్పలతికా రాగం – తిశ్ర రూపక తాళంలో – మైసూర్ వాసుదేవాచార్య వారి కీర్తన బాగా గానం చేసారు.జయ జయ స్వామి – నాట రాగం – అది తాళం లో – నారాయణ తీర్థ కీర్తనను బహు శ్రావ్యంగా గానం చేసి అందరి హర్ష ద్వానాలు అందుకొన్నారు.గురు కృప లేక – పుష్పలతికా రాగం – తిశ్ర రూపక తాళంలో – మైసూర్ వాసుదేవాచార్య వారి కీర్తన శ్రావ్యంగా గానం చేసారు.వేణుగాన – కేదారగౌల రాగంలో – రూపక తాళంలో – త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడి శ్రీకృష్ణుని సాక్షాత్కరింప జేసేరు. కృష్ణాష్టమి ఇవాళే అన్నట్టు అనిపించి శ్రోతల ఆనందానికి అవధులు లేవనిపించింది.దయానదో రంగ – కళ్యాణి రాగం – అది తాళం లో – పురందర దాసు కీర్తన బహు శ్రావ్యంగా పాడేరు బెంగుళూరు సోదరులు.సరస సామ దాన – కాపీనారాయని రాగం – అది తాళం లో – త్యాగరాజ స్వామి వారి కీర్తన, తరువాతశ్రీ సుబ్రహ్మణ్య – తోడిరాగం – అది తాళం లో – దిక్షితర్ వారి కృతి లో వారి ప్రతిభ తెలిసేటట్టు పాడి అందరి మన్ననలు పొందేరు.శ్రీ హనుమాన్ – దేశ్ రాగం – అది తాళంలో – శ్రీ HHH గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాటనుజయ జయ నృసింహ – సింధు భైరవి రాగం – అది తాళం – అన్నమాచార్య వారి కీర్తన గానం చేసి నృసింహస్వామి వారిని స్తుతించి సింహాచలం అప్పన్న ఆశీస్సులు పొందేరు.కూనిడదో కృష్ణ – హంసనంది రాగం – అది తాళం – పురందర దాసు కీర్తన, చివరిగా జయతి జయతి – ఖమచ్ రాగం – తిశ్రా నాదాయ్ – మయూరం విశ్వనాధ్ శాస్త్రి పాటతో కాచేరి రక్తి కట్టించి ప్రతి ఒక్కరి హార్ధద్వానాలు చూరగొన్నారు.వారి రాగాలాపన, స్వరకల్పన, నెరవులు అత్యున్నత స్థాయిలో ప్రదర్శించి వారి ప్రతిభను చూపించేరు.వైయలిన్ పై సంగీత ‘కళాభారతి’, శ్రీ M. S. N. మూర్తి, టాప్ గ్రేడ్ విద్వాన్సులు వయోలిన్ సహకారం అద్భుతం. వారు రాగం వాయిస్తూ ఉంటే సోలో కచేరిలా అనిపించింది. మృదంగంపై “సంగీత కళాభారతి ” బిరుదాంకితులు డాక్టర్ వంకాయల వెంకటరమణ అలాగే ఘటంపై హరిబాబు సహకారం అందించి కచేరి స్థాయిని పెంచి అందరి మెప్పు పొందారు. రేపటి కార్యక్రమం 29 మంది నృత్య కళాకారులు బెంగుళూరు వారు ” శ్రీ హరి లీలా కల్పతరువు” కూచిపూడి నృత్య రూపకం ఉంటుందని అందరూ ఆహ్వానితులే అని కార్యదర్శి Dr. రాంబాబు కోరేరు.
Private video
This video is private.
Related Articles
-
-
-