విజయనగరం జిల్లా రాజాంలో ఉంటున్న ఏగిరెడ్డి కృష్ణ అనే స్కూలు టీచర్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చింది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. మాస్టార్ని చంపేశారంటూ విద్యార్థులు ఏడవడం అక్కడున్నవారందరికీ కన్నీరు తెప్పించింది.
















