Pawan Kalyan జనసైనికులతో సమావేశం లో వైసీపీపై ఘాటుగా విమర్శలు మంగళగిరి Vizagvision
ప్యాకేజీ స్టార్ అన్నారో.. ఊరుకునేది లేదు: పవన్
వైకాపాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్ అని ఎవరైన మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతా అని హెచ్చరించారు.
జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘‘ఇంతకాలం నా సహనం మిమ్మల్ని కాపాడింది. ప్యాకేజీ ఇస్తానంటే పళ్లు రాలగొడతా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగాను.
ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను. సభ్యత, సంస్కారం ఉన్నవాళ్లం కాబట్టి మౌనంగా ఉన్నాం.
వైకాపా గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
















