ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3M2..లంచ్ ప్యాడ్ మీద అమర్చిన జిఎస్ఎల్వి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. ప్రతిష్టాత్మక జిఎస్ఎల్వి మార్క్- 3 M2 ని రోదసిలోకి పంపేందుకు సిద్ధమైంది. నిన్క్ శనివారం రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ మీద అమర్చారు. ఈనెల 23న జీఎస్ఎల్వీ మార్క్- 3 M2 భారీ ఉపగ్రహవాకలోక అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది.
ఇందుకు తిరుపతి జిల్లా రాకెట్ సిటీ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి.జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ద్వారా 36 కమర్షియల్ ఉపగ్రహాలు నింగికి పంపనుంది ఇస్రో.
మరోసారి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో
ప్రతిష్టాత్మకంగా భావించే జీఎస్ఎల్వీ మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా వాణిజ్యపరమైన 36 ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లబోతోంది. ఈ నెల 23న భారత భారీ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకను అంతరిక్షంలోకి చేర్చనున్నారు.
జి ఎస్ ఎల్ వి మార్క్ 3 లాంటి భారీ ఉపగ్రహాలను ఇంతకుముందు కూడా ఈ ఇస్రో ప్రయోగించినప్పటికీ ప్రస్తుతం పూర్తి వాణిజ్య అవసరాల కోసం దీన్ని రూపొందించారు. పైగా ఎన్ఎస్ఐ ఎల్ తో ఒప్పందం తర్వాత జరుగుతున్న తొలి బరువైన రాకెట్ ఇదే. దాదాపు 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ ఎస్ ఐ ఎల్ )లు భారీగా వాణిజ్య లాభాలు అర్జించడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.
తాజాగా చేపట్టే భారీ ప్రయోగానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామానికి ఈ రెండు సంస్థలు శ్రీకారంచుట్టాయి. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్ లలో ఈ భూకేంద్రాన్ని వినియోగించుకోవడానికి శ్రీకారంచుట్టారు. ఈ నెల 23న తెల్లవారుజామున 12 గంటల 7 నిమిషాలకు షార్ లోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగాన్ని ప్రయోగించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ప్రయోగాన్ని సంబంధించి శ్రీహరికోటలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను సిఎస్ఎఫ్ బలగాలను మొహరింపజేశారు…

















