Port New Record in Single Day Cargo Handling | పోర్ట్ ట్రస్ట్ మరో అరుదైన రికార్డును సాధించింది | Visakhapatnam | Vizagvision ఒక్క రోజులో రికార్డ్ కార్గో హ్యాండ్లిగ్ రెండేళ్లలో మూడోసారి రికార్డ్ కార్గో హ్యాండ్లింగ్ ఘనత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరో అరుదైన రికార్డును సాధించింది. ఒకే రోజులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనతను సాధించింది. ఈ నెల 26వ తేదీన ఒక్క రోజులో రికార్డు స్ధాయిలో విశాఖపట్నం పోర్టు కార్గోను హ్యాండిల్ చేసి ఈ ఘనతను సాధించింది. ఇన్నర్ హార్బర్, అవుటర్ హార్బర్ మరియు ఎస్ పి ఎం ల నుంచి 3,73,544 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేయడం ద్వారా ఒక్కరోజులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసి రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 25 న పోర్టు కు వచ్చిన—-నౌకల ద్వారా ఈ సరుకును హ్యాండిల్ చేశారు. 2021లో పోర్టు సాధించిన 3,70,029 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ఇప్పటి వరకూ పోర్టు ఒక్క రోజులో హ్యాండిల్ చేసిన సరుకు, రికార్డులలో ఉంది. తాజాగా ఈ ఘనతను పోర్టు అధిగమించింది. 2019 డిసెంబర్ 2 న 19 నౌకల నుంచి 3,47,722 మెట్రిక్ టన్నులు సరుకును హ్యాండిల్ చేసింది. ప్రస్తుతం ఈ రికార్డును అధిగమించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నూతన రికార్డును నెలకొల్పింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల చైర్మన్ శ్రీ కే రామమోహనరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు సిబ్బంది ని పోర్టు ట్రస్ట్ చైర్మన్ శ్రీ కె రామమోహనరావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించి పోర్టు అభివృద్ధికి నిరంతం కృషి చేయాలని అభిలషించారు. ఈ ఘనతను సాధించిన ట్రాఫిక్ మేనేజర్ ను ఉన్నత అధికారుల సమావేశంలో పోర్టు చైర్మన్ రామ్మోహనరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ సెక్రటరీ వేణుగోపాల్ పాల్గొన్నారుపాల్గొన్నార #Vizagvision #PortNewRecordCargoHandling For Inquiries Please WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com And Also Follow Us On : vizagvision Groups Website: http://www.vizagvision.com/ Facebookpage: https://www.facebook.com/vizagvision Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision Please Subscribe My Channel Please Follow This Links Don’t For Got Please Support Me Friends Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel. https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
















