ఉద్యోగాల భర్తీలో కీలక సంస్కరణలు, పారదర్శకతకు పెద్దపీట

ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహి చంద్రబాబు
ఆర్థిక నిర్వాహణలో అతి చెత్త రికార్డ్ చంద్రబాబుది
మల్టీ నేషనల్ నావికా విన్యాసాలకు విశాఖ వేదిక కావడం రాష్ట్రానికే గర్వకారణం
ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
పారదర్శకంగా ఉద్యోగ నియామకాలతో పాటు అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా పలుకీలక సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గ్రూప్-1 మినహా అన్నిపోస్టులకూ ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితర సంస్కరణలు చేపట్టిందని అన్నారు.
అమూల్ సంస్థ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తోందని అమూల్ రాకతో రైతులకు లీటరుకు అదనంగా రూ.9 ఆదాయం లభిస్తోందని అన్నారు. మహిళా సాధికారతకు డైనమిక్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి బాగుందని అమూల్ మేనేజింగ్
ఆర్ఎస్ సోథి పేర్కొన్నారని చెప్పారు.
ప్రతి జిల్లాలో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలో విశాఖ, విజయవాడ, మదనపల్లిలో ప్రారంభం కనున్నాయని ఆయన అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పట్లో కేంద్రం ప్రకటించిందని,రూ.24,350 కోట్లు ఇవ్వాలని అధికారులు నివేదిక సమర్పించారని తెలిపారు. జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లు ఇస్తామంటే చంద్రబాబు అంగీకరించారని, ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.
అప్పుల గురించి బాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని. ఆర్థిక నిర్వహణలో అతి చెత్త రికార్డు సొంతం చేసుకున్న చంద్రబాబు, తాను వదిలి వెళ్లిన బకాయిలు ఎంతో గుర్తుచేసుకో వాలని అన్నారు. 11% వడ్డీకి తెచ్చిన అప్పులు, రోడ్ల కోసం తీసుకున్న రుణాలను పసుపు-కుంకుమ కోసం ఖర్చుపెట్టింది మీరే కదా అని గుర్తుచేసారు.
సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సిఎం జగన్ ని కలవడం పచ్చ పార్టీలో పెద్ద కలకలము రేపినట్లుందని,చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మల్టీ నేషనల్ నావికా విన్యాసాలు ‘మిలన్’కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వడం రాష్ట్రానికి గర్వకారణమని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈ విన్యాస కార్యక్రమాలు జరగడం విశాఖపట్నానికి మరింత గర్వకారణమని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న దృష్ట్యా ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు.
మీకంటే పెద్ద దొంగలు,మూర్ఖులు ఎవరుంటారు పప్పూ అని ఎద్దేవా చేశారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చినా కాపాడటం మీ తప్పుకాదా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘం లీడర్ గా లేపి ప్యాకేజిలిచ్చి, చివరకు ఎమ్మెల్సీని చేసిన ఘనత మీదేకదా అని అన్నారు. నారా వారి సి.ఆర్.పి.సి లో రాత్రిపూట అరెస్టులు చేయొద్దని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.
















