రాజ్యాంగ విలువలకు పట్టిన చెద..బిజెపి CPM బృందా కారత్ in Visakhapatnam Vizagvision..విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్ లో బిజెపి విధానాలను ప్రతిఘటిస్తూ… ఈనెల 27న దేశ బంద్ జయప్రదం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అనే నినాదిస్తూ సిపిఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభ లో ”కేంద్రంలోని బీజేపీ-మోడీ పరిపాలనతో రాజ్యాంగ విలువలకు పూర్తిగా చెద పట్టించారని, త్వరలో మోడీని దేశ ప్రజలు గద్దె దింపే అతి పెద్ద పోరాటాన్ని చేపడతారని” సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా త్రిపురా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ దాస్ మృతి చెందడం బాధాకరమన్నారు. కరోనాతో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తున్నానన్నారు. దేశంలో కరోనా వల్ల 4.43 లక్షల మంది మరణించారని, ప్రపంచంలో కరోనా మరణాలు 24% అమెరికాలోనే జరిగాయని అన్నారు. చైనాలో 6 శాతం మాత్రమే నమోదయ్యాయని సోషలిస్ట్ వ్యవస్థలో ఆహరము, ఆరోగ్యం ప్రజల హక్కుగా ఉన్నందునే మరణాలు తగ్గించగలిగారన్నారు. వియత్నం, క్యుబాలో కరోనా కట్టడి చేయడంలో కమ్యూనిస్ట్ దేశాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. భారత్ లో మోడీ పాలనలో వలస కార్మికులు రోడ్లుపై వేల కిలోమీటర్లు నడిచి, ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆక్సిజన్ అందక ఢిల్లీ నడిబొడ్డున ప్రజల ప్రాణాలు పోయాయి. ఫ్రీ వాక్సిన్ అని పెద్ద పెద్ద హోర్డింగ్లు మోడీ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సందర్భం చరిత్రలో లేదన్నారు. ప్రజా సమస్యలపై గాకుండా మత సమస్యలపై పోరాడటం బీజేపీ పనిగా మారిందన్నారు. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనుస్మృతి ప్రకారం వెళ్తామని చెప్పిన పార్టీ ఈ బిజెపి అని ఎద్దేవా చేశారు. అందుకే దేశానికి పట్టిన చెద ఈ బిజెపి అని, వీళ్లు రాజ్యాంగ విలువలను తినేస్తున్నారంటూ బృందా మండిపడ్డారు. దేశ సంపదను ఆదాని, అంబానీలకి కట్టబెడుతున్నారని ఈ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక్క కార్మికులు మాత్రమే కాదు మిగిలిన రంగాలు కూడా కుదేలు అవుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయద్దని కాదని కేంద్రం ముందుకెళ్తే అది కేంద్ర ప్రభుత్వానికి ముప్పు తెస్తుందని ఆమె హెచ్చరించారు. ఢిల్లీలో 9 నెలలుగా రైతులు పోరాట పటిమ చూపిస్తున్నారని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా.. పార్లమెంట్ లో సంఖ్య బలం చూపించి చట్టం చేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఒక వైపు అన్నదాత ఆందోళన, మరో వైపు తిండి లేక ఆవేదన రైతు పడుతున్నా దేశంలోని గోడౌన్ లలో 9లక్షల కోట్ల కేజీల బియ్యం ఎఫ్ సి ఐ గోదాములో పడి ఉందని పంచడం లేదన్నారు. పైగా మోదీ పుట్టిన రోజు నాడు ఉచిత బియ్యం సంచులు ఇస్తారని, వాటి మీద రైతు ఫోటో ఉండదన్నారు. కేవలం మోదీ ఫోటో మాత్రమే ఉండటాన్నీ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం పెద్దలు నెరవేర్చారా? ప్రత్యేక హోదా ఇస్తామని హామీ నేర వేర్చాలి ఇచ్చారా? ఏపీ ప్రజల కోసం సీఎం జగన్, ప్రతిపక్షాలు టీడీపీ కలిసి ఎందుకు అడగడం లేదు అని ఆమె రాష్ట్ర పార్టీలను ప్రశ్నించారు. జగన్ కి వ్యక్తిగత కారణాలు ఉన్నందున కేంద్రాన్ని అడగడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కొండయ్య ప్రసంగించారు. సభ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి డా.బి.గంగారావు అధ్యక్షత వహించారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/















