కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు ఘనంగా సత్కారం,..సింహద్రినాథుడి జ్ఞాపిక, విశాఖ చరిత్ర పుస్తకం బహుకరణ

విశాఖపట్నం: రాష్ట్రంలోనే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని సింహచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను విశాఖ పోర్టు అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించి సింహా వాద్రినాధుడి జ్ఞాపికను. విశాఖ నగర చరిత్రను, గొప్పతనము తెలియజేసే పుస్తకాన్ని బహుకరించారు. వాటితో పాటు వినతి పత్రం సమర్పించారు.. గతంలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాయలసీమలో నాలుగు జిల్లాలను కలుపుకుని మొత్తం ఏడు జిల్లాలకు ప్రతీ ఏటా జిల్లాకు 50 కోట్లు చొప్పున నిదులు మంజూరు చేయడానికి కేంద్రం ఆంగీకరించిదని మంత్రికి శ్రీనుబాబు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. తదుపరి కొంత మొత్తము నిధులు విడుదల చేశారని, అయితే ఆ తరువాత నిధులు సకాలంలో మంజురు కాలేదని మంత్రికి శ్రీనుబాబు తెలిపారు. వెనుకబడిన ఆయా జిల్లాలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించడంతో పాటు, పెండింగ్ నిధులను మంజూరు చేయాల్సిందిగా శ్రీనుబాబు వినతి లో కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనుబాబు చెప్పారు.
















