“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అన్న నినాదంతో సుదీర్ఘకాలం పోరాటాలు కారణంగా, చివరకు 32 మంది ప్రజలు ప్రాణతాగ్యం చేసి, 66 గ్రామాల ప్రజలు 26వేల ఎకరముల భూమిని రైతులు స్వచ్చందంగా త్యాగం చేసి ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. 1971లో శంఖుస్థాపన జరిగి, 1978లో నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. దీని వల్ల 17 వేల 500 మంది శాశ్వత కార్మికులకు మరో 15 వేల మంది ఒప్పంద కార్మికులకు ప్రత్యక్షంగానూ, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఇప్పటికీ ఇంకా 08 వేల మంది నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉంది. అటువంటి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేసి పోస్కోకి కట్టబెట్టాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి గురువారం విశాఖ సిపిఐ కార్యలయంలో జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. 1998-99 సం”లో బి.ఐ.ఎఫ్.ఆర్ లోకి అప్పటి ప్రభుత్వం నెట్టబడితే ఉక్కు ఉద్యమకారులు స్వాతంత్ర సమర యోధులు శ్రీయుతులు పత్తి శేషయ్య, బైరాగిలు జల సమాధికి సిద్ధమైన సంగతి గుర్తుంచు కోవాలని, ఈ పోరాటం వలన బి ఐ ఎఫ్ అర్ గండం నుండి బయట పడడమే కాకుండా అనంతరకాలంలో లాభాలను ఆర్జించడంతో సొంత విధులతో మరియు బ్యాంకు రుణంతో మొదటి దశ విస్తరణ పనులు పూర్తిచేసి 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామార్థాన్ని పెంచుకుందని భవిష్యత్తులో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం విస్తరించే అవకాశం ఉన్న ఈ కర్మాగారం 2015 తరువాత నుండి నష్టాలు వస్తున్నాయని నవరత్న హోదా కలిగిన ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి బిజెపి ప్రభుత్వం పూనుకున్నది. మన రాష్ట్రంలోనే విశాఖటి ఉక్కు అంత భారీ పరిశ్రమ మరొకటి లేదు. ఈ పరిశ్రమ వలనే గాజువాక నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్వధిక తలసరి ఆదాయం కలిగిన కేంద్రంగా ఉంది. విశాఖ ఉక్కుకి సొంత ఘనులు కేటాయిస్తే నష్టాలనుండి గట్టెక్కి లాభాల బాటన నడుస్తుంది. డిసెంబరు 2020లో సుమారు 200 కోట్లు నిర్వాహణ లాభాలను ఆర్జించింది ఇటువంటి పరిశ్రమకు స్వంత ఘనులు కేటాయించి అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉన్న విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి కృషి చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి ! గతంలో విశాఖపట్నం లో లాభాలతో నడుస్తున్న హిందూస్తాన్ జింక్ కర్మాగారాన్ని ఇదే పెట్టుబడులు ఉపసంహరణ పద్దతిలో ప్రధాన మంత్రి గారికి అత్యంత సన్నిహిత కంపెనీ వేదాంతం గ్రూపు కి కట్టబెట్టారని విమర్శించారు. అదే పద్దతిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో కంపెనీకు కట్టబెట్టాలన్న కుట్రను తిప్పి కొట్టేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఉక్కు పరిరక్షణ కోసం మరో ఉద్యమం నిర్మిస్తామని సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే మరో ఉద్యమం తప్పదు సీపీఐ సత్యనారాయణ Visakhapatnam,Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/


















