Simachalam Trust Board Chairman Sanchaitra GajapathiRaju on Case Filed by Fanindra Bhupathi in Visakhapatnam,Vizagvision….సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్స్ గా విధులు నిర్వహిస్తున్న సంచిత గజపతి పై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో సింహాచలం స్థానికులు ఫణీంద్ర భూపతి పిర్యాదు చేశారు.
సంహచలంలో స్తానికుడైన ఫణీంద్ర భూపతి ముందుగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి తోలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు.ఈ సౕదర్బంగా ఫణీంద్ర మీడియాతో మాట్లాడుతూ సంచయిత గజపతి రాత్రికి రాత్రి గా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని నియమించడం లో వెనక ఉన్న కుట్ర ఏంటో అని ఆరోపించారు…ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి సంచిత అర్హురాలు కాదని ఆరోపణలు చేశారు. సంచిత రాత్రికి రాత్రి గా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అంద పుచ్చుకున్నారు అని సింహాచలం భూములు మరియు సంపదపై ఎన్ని ఆరోపణలు పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించడం లేదని తెలిపారు.సంచిత గజపతి అశోక్ గజపతి వంశ మేనా అనే విషయంపై పిర్యాదు లో పేర్కొన్నారు. వారసత్వం పై కోర్టు నందు కేసు నడుస్తుండగా పదవీ ని ఏ విధంగా కొనసాగిస్తారు అని, సంచిత నిజంగా అశోక గజపతి వారసరాలు అయితే వెంటనే మీడియా ముందుకు వచ్చి తన వారసత్వాన్ని నిరూపించుకొని పదవిని కొనసాగించాలని అన్నారు.ఇప్పటికైనా ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతి పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఫణీంద్ర డిమాండ్ చేశారు….
















