హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ దాతల సహకారముతో నిత్యా అవసర సరుకులు కిట్స్ మరియు భోజన వితరణ కార్యక్రమాలు
దాతల సహకారముతో నిత్యా అవసర సరుకులు కిట్స్ పంపిణి కోవిద్ -19 రిలీఫ్ పోగ్రామ్
ఈ రోజు డ్రై రేషన్ కిట్స్ పంపిణి కార్యక్రమము శ్రీ విజయ సాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు
ఈ కిట్స్ దాతలు మైక్రోన్
ఈ కార్య క్రమములో శ్రీ విజయ సాయి రెడీ గారు హరే కృష్ణ మూవ్మెంట్ అండ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవల ను ప్రశంచించినారు
హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో ఈ రోజు ౧౦౦౦ డ్రై రేషన్ కిట్లను శ్రీ విజయ సాయి రెడ్డి గారికి ( రాజ్య సభ సభ్యులు ) and sri vamsi krishna srinivas gariki డాక్టర్ నిష్కించన భక్త దాస గారు ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు పంపిణి చేయుటకు అండ చేయడం జరిగింది . కోవిద్ 19 లో హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహించిన సేవ కార్యక్రమాలను శ్రీ విజయ సాయి రెడ్డి గారికి వివరించడం జరిగింది .
కోవిద్ -19 నందు అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వహించిన సేవ కార్యక్రమాలు
1. జీవీఎంసీ వారి ఏర్పాటు చేయబడిన షెల్టర్లు నందు అల్పాహారం , భోజనము ను 26-03-2020 తేదీ నుంచి దాతల సహకారముతో సరఫరా చేయడం జరుగుతుంది సరఫరా చేయబడిన భోజనాలు 83896
2.వలస కూలీలు లకు ఆనందపురం దగ్గర గుడిలోవ స్కూల్ వద్ద ఆహార పంపిణి కేంద్రము నిర్వహించడం జరిగింది ఈ కేంద్రము నుంచి 26000 మందికి భోజనములు సరఫరా చేయడం జరిగింది
3. కే జి హ్ హాస్పిటల్ నందు రోగి సహాయకుల కొరకు 22-03-2020 నుంచి భోజన పంఫిణీ కార్యక్రమము ప్రతి రోజు 700 మందికి మూడుపూటలా భోజన సరఫరా
4. దాతల సహకారముతో నిత్యావసర సరుకుల పంఫిణీ 30000 డ్రై రేషన్ కిట్స్ విశాఖపట్నం లోని పేదలకు పంపిణి చేయడం జరిగింది .
హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు కోవిద్ రిలీఫ్ ప్రోగ్రాం ద్వారా దాతల సహకారముతో విశాఖపట్నం లో 30000 మందికి 10 రోజులకు సరిపోవు రోజువారీ సరుకుల ప్యాకేట్లను హరే కృష్ణ మూవ్మెంట్ వాలంటీర్స్ ద్వారా నిరుపేదలకు తమవంతు సాయముగా అందచేయడం జరుగుతుంది .
ఈ కిట్స్ నందు భద్రపరిచిన సరుకులు పట్టిక
బియ్యం , కందిపప్పు , శనగపప్పు , వంటనూనె ,పసుపు , జిలకర , ధనియాలు పొడి , సాంబార్ మసాలా , గరంమసాలా మరియు ఊరగాయ .. ఈ కిట్టు ద్వారా 21 రోజులు ఒక వ్యక్తి రొండు పూటలా భోజనం చేయగలుగుతారు
అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాల లో భోజనం తయారు కావించి భోజన సరఫరా వాహనములలో హాట్ ప్యాక్ లలో వేడి వేడి గా GVMC Shelters ఆవాస గృహాలలో జీవీఎంసీ అధికారుల సహకారముతో పంపిణి చేయడం జరుగుతుంది . పంఫిణీ చేయు ఆహార పదార్ధములు అన్నము , కూర , పప్పు / సాంబారు , పరుగు అన్నము , పచ్చడి .
ఈ సేవ కార్యక్రమాలకు సహకరించిన దాతలకు మరియు స్వచ్చంధ కార్యకర్తలకు డాక్టర్ నిష్కించన భక్తదాస గారు ఈ పత్రిక ప్రకటన ద్వారా అభినందించారు .

















