AP CM YS Jagan Meet with Governor in Vijayawada,Vizagvision…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది..
రాజ్‌భవన్‌లో సీఎం జగన్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు..
అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు ముగిసిన నేపథ్యంలో గవర్నర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం.
సుమారు అరగంట పాటు మాత్రమే వీరిద్దరి భేటీ సాగింది.
కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే.
అప్పుడు సీఎం జగన్ గవర్నర్‌ను కలిసే అవకాశం లేకపోయిందని.. ఈ క్రమంలోనే రాజ్‌భవన్‌కు వెళ్లి స్వయంగా కలిసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
ఐతే పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
సీఎం వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు..

















