104,108 వాహనాలు ను 1060 త్వరలోనే ప్రారంభం చేయనున్నట్లు వైసిపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తెలిపారు. మంగళవారం వైసిపీ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు ను అత్యాధునిక కన్నా లక్ష్మీ నారాయణ నిరాధార మాటలు మాట్లాడుతూ వున్నారు. ఈ వాహనాలు నిర్వహణ బాద్యత అరబింధో ఫార్మా కంపెనీ కీ ఇచ్చేశారని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అరబింధో ఫౌండేషన్ లో మాత్రమే విజయసాయి రెడ్డి అల్లుడు వుంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. నారా లోకేష్,కన్నా లక్ష్మీ నారాయణ కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ వున్నారన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని కాస్త టీజేపీ గా మార్చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుల మతాలు కు అతీతంగా వైసిపీ పాలన సాగుతోంది. అవినీతి చేస్తే చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నారు. జగన్మోహనరెడ్డి హయాంలో అవినీతి రహిత పాలన సాగుతోంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షంలో ఉన్న ప్పుడే జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 150 కోట్ల మందుల కొనుగోలు స్కాం లో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేస్తే లోకేష్ బాబు ఎందుకు బాధ పడుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమాల పై విచారణ జరిపిస్తే లోకేష్ ,చంద్రబాబుకు వచ్చిన కష్టం ఏంటి అని ప్రశ్నించారు. టీడిపి హయాంలో అవినీతికి కర్త,కర్మ ,క్రియ లోకేష్,చంద్ర బాబు నాయుడులే అన్నారు. గతంలో అవినీతి ఆరోపణలపై సవాలు స్వీకరిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పే సరికి కన్నా కనిపించకుండా పోయారు.వైఎస్ హయాంలో ఫోన్ చేస్తే 108 లు వస్తే చంద్రబాబునాయుడు హయాంలో టైర్ లో గాలి లేదు ట్యాంక్ లో డీజిల్ లేదు అని సమాధానం వచ్చింది.
108 లను ఓ మినీ సూపర్ హాస్పిటల్ లుగా మార్చితే కన్నా లక్ష్మీనారాయణ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.అరబిందో ఫౌండేషన్ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తే కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు చెయ్యడం తగదు.
కన్నా లక్ష్మీనారాయణ అదేపనిగా విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదు.నిత్యం సీఎం జగన్..ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించి మీడియాలో కనిపించడం కన్నా కు అలవాటుగా మారింది. ఈ మీడియా సమావేశంలో 72వ వార్డు వైసిపీ కార్పొరేటర్ అభ్యర్థి,వైసిపీ నగర శాఖ సేవాదళ్ అద్యక్షుడు సిరట్ల శ్రీనివాస్,మహామ్మద్ షరీఫ్,నాగేంద్ర పాల్గొన్నారు.
















