Tirumala Srivari Darshan Begins after 70 Days Lockdown శ్రీవారి దర్శనం ప్రారంభం,Tirumala,Vizagvision…కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభమయ్యాయి. మార్చి 20 తర్వాత దర్శనాలను తితిదే తిరిగి ప్రారంభించింది. గంటకు 500 మంది చొప్పున రోజుకు 6 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. మొదటి రెండు రోజులు తితిదే ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు, 11వ తేదీ నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తిచేసింది.
శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న వేళ తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఆలయాన్ని తీర్చిదిద్దారు


















