Simhachalam Simhadri Appanna Kalyanam in Simhachalam,Visakhapatnam,Vizagvision…సింహచలం . ఉత్తరాంధ్రప్రజల ఆరాద్యదైవం శ్రీవరహాలక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కళ్యాణమహోత్సవమ్ కరోనా ప్రభావంతో ఆలయంలోనే నిరాడంబరంగా జరిగింది .ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారికళ్యామహోత్సవం వైదిక వర్గాలనడుమ ,భక్తుల సందడి లేకుండా జరిగింది . ఉత్సవంలో భాగంగా స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాత సేవతో మెల్కొలిపారు .పవిత్ర గంగధార జలాలతో అభిషేకించారు .నిత్యారాధనలు నిర్వహించారు .అనంతరం సాయంత్రం కొట్నాల ఉత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు ఆలయంలో అయ్యవారిని , అమ్మవార్లను వేరు వేరు పల్లకిలో ఉంచి ఆలయ బేడా మందంపంలో తిరువీది నిర్వహించారు .అనంతరం గరుడాళ్వార్ చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైకి వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు .అనంతరం ఆలయం లోపల స్వామివారిని , అమ్మవార్లను ఎదురెదురుగా ఆశీనులను గావించి సంప్రదాయబద్దంగా ఎదురు సన్నాహాత్సవాన్ని వైదికులు రక్తి కట్టించారు .అనంతరం జరగాల్సిన రథోత్సవాన్ని ప్రభుత్వం రద్దుపరచడంతో , ఆలయంలోనే కళ్యాణం ప్రారంభం అయ్యింది . అప్పన్నస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామిని ,ఉభయదేవేరులైన శ్రీదేవి,భూదేవి సమేతంగా పుస్పాలంకరణ గావించిన వేదికపై ఆశీనులను గావించి , ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్టిగోపాలకృష్ణమాచార్యులు తదితరులు పాంచరాత్ర ఆగమశాత్ర రీతిలో విశ్వక్షేణ ఆరాధనా ,పుణ్యహవచనములుతో కళ్యాణమహోత్సవాన్ని ప్రారంభించారు .బ్రహ్మముహూర్తవేళ మంగళ వాయిద్యాలు ,వేదమంత్రోచ్చరణల నడుమ జీలకర్ర బెల్లం వధూవరుల శిరస్సుపై ఉంచారు .అనంతరం ప్రత్యేకపూజలు నిర్వహించ మాంగల్యధారణ గావించారు .అంతరం ముత్యాలు కలిపిన తలంబ్రాలతో వేడుకుగా తలంబ్రాలబోత కార్యక్రమం నిర్వహించారు .
















