శ్రీ వరాహలక్ష్మీ నసింహస్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం in Visakhapatnam,Vizag Vision..శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం . జిల్లామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , బుధవారం చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పూసపాటి సంచయిత గజపతిరాజు , దేవస్థానం ఈ .ఓ . సమక్షంలో 16 మంది సభ్యులతో కూడిన పాలకమండలి గురువారం ఏర్పాటు అయ్యింది .సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్ సంచయిత గజపతిరాజు మాట్లాడుతూ తన తండ్రి ఆనంద్ గజపతిరాజు తో అనుబంధాన్ని గుర్తు చేస్తూ తనను పరిచయం చేసుకుంటూ కన్నీరు పర్యంతం అయ్యారు . తాను సేవాసంస్థద్వారా ప్రజలకు మంచి నీరు బయో టాయిలెట్స్ , పాఠశాలల అభివృద్ధిపై పలు కార్యక్రమాలద్వారా సేవలు నిర్వహించానని అన్నారు .తనను గుర్తించి చైర్మన్ పదవి కి నియమించిన సి .ఎం .జగన్మోహనరెడ్డి , విజయసాయిరెడ్డి లకు కృతఙ్ఞతలు తెలిపారు .అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ మహిళలకు ఇంత పెద్ద స్థాయిలో పదవులను కల్పించిన ఘనత సి .ఎం జగన్ కు దక్కుతుందని అన్నారు .
















