Central Health Department Visit to Corona Virus patients has been set up special wards in KGH in Visakhapatnam,Vizagvision…ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దిల్లీలోని జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ నుంచి ముగ్గురు వైద్యుల బృందం విశాఖ చేరుకుంది. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్.షికా వర్ధన్ నేతృత్వంలో విశాఖలో ఈ బృందం మంగళవారం ఊపిరితిత్తులకు టిబి ఆసుపత్రి, కేజీహెచ్ తో పాటు వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పర్యటించింది. సోమవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలను బృందం పరిశీలించింది. కరోనా విషయంలో నివారణ ప్రధాన మార్గమని జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ, డిప్యూటీ డైరెక్టర్ షికా వర్ధన్ అన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని ఆమె చెప్పారు.
జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ, డిప్యూటీ డైరెక్టర్ షికా వర్ధన్ సారథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థకు చెందిన వైద్యబృందం సోమవారం రాత్రి విశాఖ చేరుకుంది. ఈ బృందం మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నది. బృందం నగరంలోని వివిధ వైద్య సంస్థలను పరిశీలించనుంది.
విశాఖ చేరుకున్న కరోనా వైరస్ నివారణ పరిశీలన బృందం ప్రపంచ వ్యాప్తంగా భయపడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దిల్లీలోని జాతీయ అంటువ్యాధులు నివారణ సంస్థ నుంచి ముగ్గురు వైద్య బృందం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షికా వర్ధన్ నేతృత్వంలో పరిశీలన చేయనున్నది.. విశాఖలో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, వైద్య సంస్థలలో పర్యటించనుంది. ఎయిర్ పోర్టు, నౌకాశ్రయం, బస్సు, రైల్వే స్టేషన్స్లు పరిశీలన చేయనుంది. సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయంలో ఈ బృందానికి జిల్లా వైద్య అధికారులు స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలను మొదటగా ఈ బృందం పరిశీలించింది. విదేశీ “ ప్రయాణికులను పరీక్షిస్తున్న విధానాలు పరిశీలించారు. మంగళ, బుధవారం వివిధ వైద్య సంస్థలను బృంద సభ్యులు పరిశీలిస్తారు. విశాఖలో పారిశుద్ధ్యం ఇతర అంశాలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన వల్ల ఈ వైరస్ బారిన పడకుండా చేయగలమని పేర్కొన్నారు. విమానాశ్రయంలో కరోనా వైరస్ పరీక్షా కేంద్రం, రెండు అంబులెన్సులు నిరంతరం ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికులను కేజీహెచ్‌కు తరలించి తగిన వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసినట్టు విశాఖ విమానాశ్రయ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందానికి తెలిపారు.
















