మహిళలు, బాలికలపై దాడులు నివారణకు“భాయ్ యాప్” ఆవిష్కరణ
in Visakhapatnam,Vizagvision…మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు నివారణకు, వారిని ఆదుకునేందుకు ఉపయుక్తంగా రూపొందించిన “భాయ్ యాప్”ను బుధవారం రాంనగర్ లో ఉన్న మానవ హక్కుల కౌన్సిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో యాప్ రూపకర్తలు ఆవిష్కరించారు. సందర్భంగా మానవహక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు, పిల్లలపై అత్యంత విషాదకర అత్యాచార దాడుల సంఘటనలు జరుగుతున్నాయని, ఈ పరిణామాలు అందరినీ కలచి వేస్తున్నాయని అన్నారు. దీనిపై ఎవరికి సాధ్యమైన రీతిలో వారు స్పందిస్తున్న తరుణంలో విశాఖ విద్యార్థులు కూడా వినూత్నంగా ఆలోచించి “భాయ్ యాప్”ను రూపొందించారని ఎంతో అభినందనీయ విషయమన్నారు.
ఆపదలో ఉన్నవారికి టెక్నాలజీని విద్యార్థులు అందరికీ అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. యాప్ రూపకల్పనకు కృషిచేసిన విద్యార్థులు జీవన్, శంకర్, వరలక్ష్మి, పద్మ, నవ్య, మహమ్మద్ మదీనా షా ను అభినందించారు.
వీరి ఆలోచనకు 2019 డిసెంబరు 2న ఓ రూపం తీసుకువచ్చి సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలను ఆపడానికి ‘భాయ్ యాప్’ను రూపొందించారని తెలిపారు. దీని ద్వారా బాధితులు తాము ఉన్న ప్రదేశం (లొకేషన్)ను నోటిఫై చేయడం ద్వారా బాధితులు రక్షణ పొందవచ్చునని తెలియజేశారు.
మహిళలు, ఇతరులు ఎవరైనా, ఆపదలో ఉన్నపుడు రక్షణగా నిలిచేందుకు భాయ్ యాప్ ఉపయోగపడుతుందని మానవహక్కుల కౌన్సిల్ మహిళా సభ్యులు వరలక్ష్మి, నవ్య, పద్మావతి అన్నారు.ఒంటరిగా, నిస్సహాయంగా ఉన్నవారు దాడికి గురైనపుడు ఈ యాప్ సహాయపడుతుందని. బాధితురాలు/బాధితుడు ఏ ప్రదేశంలో ఉన్నారనే సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, 10 మంది నమ్మకస్థులకు, ఈ యాప్‌ను ఉపయోగించే యూజర్లు 20 కిలోమీటర్ల పరిథిలో ఉంటే, వారికి తెలియజేస్తుందని జీవన్ అన్నారు. బాధితురాలు/బాధితుడు ఇబ్బందుల్లో ఉన్నారని, సహాయం అవసరమని తెలియజేస్తుందని అన్నారు.
ఇదంతా విశాఖపట్టణంవాసి, 22 ఏళ్ళ యువకుడు శంకర్‌కు వచ్చిన వినూత్నమైన ఆలోచనగా తెలిపారు. నష్టం జరగడానికి ముందే సహాయం అందాలన్న ఆలోచనకు ఎడిడా ఇన్నోవేషన్, కొమ్మాదిలోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) విద్యార్థులు కే.ఎస్.జీ. శర్మ, కే. లోహిత్ సాయి, ఏ. ప్రవీణ్, కే. ఉమేశ్ చంద్ర సహకరించారు. ‘మెరుగైన భారత దేశం’ కోసం వీరంతా పరస్పర సహకారంతో ‘భాయ్ యాప్’ను రూపొందించారు.
ఈ యువ విద్యార్థులకు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, బెగ్గింగ్ హ్యాండ్స్ ఇన్ ఇండియా కూడా సహకరించాయి.
















