National Fishworkers Forum Press Meet in Visakhapatnam,Vizagvision…సముద్రం లో చేపల వేటకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ తీర్మానించన నోటిఫికేషన్ను సాంప్రదాయ మత్స్యకారుల యూనియన్ వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ మత్స్యకారుల యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లొ చేసిన తీర్మానం ప్రకారం దేశ వ్యాప్తంగా తీర ప్రాంత మత్స్య కారులంతా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు వివరాలు తెలిపారు. సముద్రంలో మెరీ కల్చర్ చేయడం వలన సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి నష్టపోవడం జరుగుతుంది అన్నారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్ చేపల వేట 90 రోజులు ఆపు చేయాలని మత్స్య కారుల యూనియన్ కోరింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టంలో భాగంగా 12 నాటికల్ మైలు వేట చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవడం వలన సాంప్రదాయ మత్స్యకారులకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా భీమిలి లొ మత్స్యకారులు జెట్టి లేక ఇబ్బందులు పడుతున్నారని , అక్కడ జెట్టి నిర్మించాలని కోరుతున్నారు. మీడియా సమావేశంలో సాంప్రదాయ మత్స్యకారులు యూనియన్ చైర్పర్సన్ పటేల్, సెక్రెటరీ పీటర్, కే లక్ష్మి, తదితరులు పాల్గొని మాట్లాడారు.
















